Back to Home
కస్టమర్ల డేటాకు ఫిన్‌టెక్‌లు ధర్మకర్తలే: ఆర్‌బీఐ గవర్నర్‌

కస్టమర్ల డేటాకు ఫిన్‌టెక్‌లు ధర్మకర్తలే: ఆర్‌బీఐ గవర్నర్‌

బిజినెస్Saturday, September 12, 20260 views1 min read
గాయాల నుంచి బుమ్రా, నితీశ్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌ కోలుకోవడంతో అఫ్ఘానిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు భారత్‌ బలమైన జట్టుతో బరిలోకి దిగనుంది. హర్షిత్‌ రాణా మాత్రం గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. మరోవైపు, జెమీమా రోడ్రిగ్స్‌ స్థానంలో ప్రతికా రావల్‌కు ఆసియా క్రీడల భారత జట్టులో చోటు లభించింది.
Key Highlights
  • • బుమ్రా, నితీశ్‌ కుమార్‌ పూర్తిగా ఫిట్‌.
  • • వాషింగ్టన్‌ సుందర్‌ ఇప్పటికే ఫిట్‌నెస్‌ సాధించాడు.
  • • అఫ్ఘానిస్థాన్‌తో భారత్‌ మూడు టీ20ల సిరీస్‌ ఆడనుంది.
  • • హర్షిత్‌ రాణా గాయం కారణంగా సిరీస్‌కు దూరం.
  • • హర్షిత్‌ స్థానంలో యష్‌ ఠాకూర్‌ ఎంపిక.
  • • ఆసియా క్రీడల జట్టులో ప్రతికా రావల్‌కు చోటు.
  • • గాయపడిన జెమీమా రోడ్రిగ్స్‌ స్థానాన్ని ప్రతికా భర్తీ చేయనుంది.
ముంబై: ఆర్థిక సేవల రంగంలో నమ్మకమే విజయానికి కీలకమని ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అన్నారు. ఫిన్‌టెక్‌ సంస్థలు తమ వద్ద ఉన్న కస్టమర్ల డేటాను వ్యాపార ఆస్తిగా కాకుండా.. ధర్మకర్తలుగా బాధ్యతతో సంరక్షించాల్సిన సమాచారంగా చూడాలని స్పష్టం చేశారు. ముంబైలో జరుగుతున్న **‘గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ 2026’**లో మాట్లాడిన మల్హోత్రా.. డిజిటల్‌ ఆర్థిక సేవల విస్తరణతో పాటు డేటా భద్రత, వినియోగదారుల నమ్మకానికి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ ఆర్థిక సేవల భవిష్యత్తును నిర్మించే క్రమంలో భారత్‌ విశ్వసనీయ భాగస్వామిగా ఎదిగే అవకాశముందని పేర్కొన్నారు. భవిష్యత్‌ తరం ఆర్థిక సేవలకు అవసరమైన డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధిపై ఆర్‌బీఐ దృష్టి సారించిందని తెలిపారు. డిజిటల్‌ చెల్లింపులకు యూపీఐ ఎలా వెన్నెముకగా నిలిచిందో.. రుణ మంజూరు వ్యవస్థలో యూనిఫైడ్‌ లెండింగ్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఎల్‌ఐ) కూడా కీలక వేదికగా మారే అవకాశం ఉందన్నారు. ఇదే సందర్భంగా యూనిఫైడ్‌ ఫిన్‌టెక్‌ ఫోరమ్‌ను ఆర్థిక సేవల రంగానికి రెండో స్వీయ నియంత్రణ సంస్థ (ఎస్‌ఆర్‌ఓ)గా ప్రకటించారు. యూపీఐలో ‘ట్యాప్‌ అండ్‌ పే’ గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌లో ఆర్‌బీఐ గవర్నర్‌ యూపీఐ ట్యాప్‌ అండ్‌ పే, మైయూపీఐ ఫీచర్లను విడుదల చేశారు. ఎన్‌ఎఫ్‌సీ సదుపాయం ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్‌ చేసి పీఓఎస్‌ టెర్మినల్‌ వద్ద ట్యాప్‌ చేయడం ద్వారా వినియోగదారులు వేగంగా చెల్లింపులు చేయవచ్చు. ఈ విధానంలో వినియోగదారుడి మొబైల్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. పీఓఎస్‌ టెర్మినల్‌కు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే చెల్లింపు పూర్తవుతుంది. మరోవైపు యూపీఐ హెల్ప్‌ సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఎన్‌పీసీఐ స్మాల్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ ‘ఫిమీ’ ఆధారంగా మైయూపీఐ అనే ఏఐ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశారు. డీమ్యాట్‌ 2.0 విడుదల సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే, ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా కలిసి డీమ్యాట్‌ 2.0ను ఆవిష్కరించారు. కార్పొరేట్‌ బాండ్ల టోకనైజేషన్‌ పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా దీన్ని ప్రవేశపెట్టారు. ఆర్‌బీఐకి చెందిన యూనిఫైడ్‌ మార్కెట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఎంఐ) ద్వారా హోల్‌సేల్‌ సీబీడీసీతో డీమ్యాట్‌ 2.0 అనుసంధానమై ఉంటుంది. టోకనైజ్డ్‌ బాండ్ల కొనుగోళ్లను హోల్‌సేల్‌ సీబీడీసీ ద్వారా నిర్వహించే విధంగా వ్యవస్థను రూపొందించారు. బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా ఈ టోకనైజ్డ్‌ బాండ్లను జారీ చేస్తారు. బాండ్ల జారీ, యాజమాన్య హక్కులు, ట్రేడింగ్‌, సెటిల్‌మెంట్‌ తదితర వివరాలను బ్లాక్‌చెయిన్‌ లెడ్జర్‌లో డిజిటల్‌గా నమోదు చేస్తారు. ఇప్పటికే ఆర్‌ఈసీ, ఎల్‌అండ్‌టీ, ఐఐఎఫ్‌ఎల్‌ సంస్థలు కలిపి రూ.1,025 కోట్ల విలువైన టోకనైజ్డ్‌ బాండ్లను జారీ చేశాయి.
Powered by Vividuss logo