Back to Home
సీసీ కెమెరాల నిఘాలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 3 వేలకుపైగా కెమెరాలతో పటిష్ఠ భద్రత

సీసీ కెమెరాల నిఘాలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 3 వేలకుపైగా కెమెరాలతో పటిష్ఠ భద్రత

ఆంధ్రప్రదేశ్Saturday, September 12, 20260 views1 min read
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు టీటీడీ భారీ స్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. ఆలయం నుంచి అలిపిరి వరకు కీలక ప్రాంతాల్లో 3 వేలకుపైగా కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, AI ఆధారిత ఫేషియల్‌ రికగ్నిషన్‌, ఫైర్‌ అలర్ట్‌, భక్తుల రద్దీ పర్యవేక్షణ వంటి సాంకేతికతలను వినియోగించనుంది.
Key Highlights
  • • శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు.
  • • తిరుమలలో 3 వేలకుపైగా సీసీ కెమెరాలతో నిఘా.
  • • ఆలయం నుంచి అలిపిరి వరకు కీలక ప్రాంతాల పర్యవేక్షణ.
  • • అలిపిరి నడకమార్గంలో కొత్తగా 110 కెమెరాల ఏర్పాటు.
  • • నాలుగు మాడవీధుల్లో 140 సాధారణ, 4 హైఎండ్‌ కెమెరాలు.
  • • హైఎండ్‌ కెమెరాలు 280 మీటర్ల వరకు పరిధిని కవర్‌ చేయనున్నాయి.
  • • కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లకు కెమెరాల అనుసంధానం.
  • • ఫేషియల్‌ రికగ్నిషన్‌, ఫైర్‌ డిటెక్షన్‌, క్రౌడ్‌ మానిటరింగ్‌ వినియోగం.
  • • అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులను గుర్తించేలా సాంకేతిక వ్యవస్థ.
  • • బ్రహ్మోత్సవాల సమయంలో భద్రత, రద్దీ నియంత్రణకు టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి.
తిరుమల, సెప్టెంబరు 10: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పటిష్ఠ భద్రత మధ్య నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ భారీ స్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. శ్రీవారి ఆలయం నుంచి అలిపిరి వరకు కీలక ప్రాంతాలను కెమెరాల నిఘాలోకి తీసుకువచ్చింది. ఆలయం, క్యూలైన్లు, కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, కల్యాణకట్ట, అన్నప్రసాద భవనం, కార్యాలయాలు, లడ్డూ కౌంటర్‌, అఖిలాండం తదితర ప్రాంతాల్లో మొత్తం 2,880 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా ప్రధాన కూడళ్లు, పార్కింగ్‌ ప్రాంతాలు, నిర్మాణ ప్రాంతాల్లో మరో 100 కెమెరాలను అమర్చుతున్నారు. అలిపిరి నడకమార్గానికీ కెమెరాల నిఘా ఈసారి అలిపిరి కాలినడక మార్గంలోనూ సీసీ కెమెరాల నిఘాను విస్తరిస్తున్నారు. ఇటీవల ఏడో మైలు వద్ద ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని చిన్న ఆంజనేయస్వామి విగ్రహం అపహరణకు గురైన నేపథ్యంలో నడకమార్గాల్లో భద్రతను మరింత పెంచాల్సిన అవసరాన్ని టీటీడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో అలిపిరి నడకమార్గంలో 110 సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. మరోవైపు గరుడ సర్కిల్‌ పరిధిలోనూ అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. జూపార్కు రోడ్డు, నంది సర్కిల్‌ వైపు ఉన్న ప్రాంతాలను కవర్‌ చేసేలా వీటిని అమర్చుతున్నారు. 280 మీటర్ల వరకు రేంజ్‌ శ్రీవారి వాహనసేవలు జరిగే నాలుగు మాడవీధుల్లో భద్రతను మరింత బలోపేతం చేసేలా 140 సాధారణ సీసీ కెమెరాలతో పాటు నాలుగు హైఎండ్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక్కో హైఎండ్‌ కెమెరా సుమారు 280 మీటర్ల పరిధిని కవర్‌ చేసే సామర్థ్యం కలిగి ఉంటుందని టీటీడీ తెలిపింది. కెమెరాల ద్వారా నమోదయ్యే దృశ్యాలను తిరుమలలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షించనున్నారు. వీటిని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు కూడా అనుసంధానం చేశారు. AI ఆధారిత నిఘా ఈసారి సీసీ కెమెరాల నిఘాలో సాంకేతికతకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సహాయంతో ఫేషియల్‌ రికగ్నిషన్‌, ఫైర్‌ డిటెక్షన్‌ అలర్ట్‌, భక్తుల రద్దీ పర్యవేక్షణ వంటి అంశాలను పరిశీలించనున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులను గుర్తించడంతో పాటు గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు కూడా ఈ వ్యవస్థను ఉపయోగించనున్నట్లు టీటీడీ పేర్కొంది. మొత్తంగా 3 వేలకుపైగా సీసీ కెమెరాలతో తిరుమలలోని కీలక ప్రాంతాలను పర్యవేక్షణ పరిధిలోకి తీసుకువచ్చి, బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రతను పటిష్ఠం చేసేందుకు టీటీడీ ప్రణాళిక రూపొందించింది.
Powered by Vividuss logo