Back to Home
తిరుపతి నుంచి విజయవాడ, హైదరాబాద్‌, రాజమండ్రికి కొత్త విమాన సర్వీసులు

తిరుపతి నుంచి విజయవాడ, హైదరాబాద్‌, రాజమండ్రికి కొత్త విమాన సర్వీసులు

ఆంధ్రప్రదేశ్Saturday, September 12, 20260 views1 min read
తిరుపతి నుంచి విజయవాడ, హైదరాబాద్‌, రాజమండ్రికి ఫ్లై91 కొత్త విమాన సర్వీసులను ప్రారంభించింది. హైదరాబాద్‌ సర్వీసు రోజువారీగా, విజయవాడ సర్వీసు వారానికి నాలుగు రోజులు, రాజమండ్రి సర్వీసు వారానికి మూడు రోజులు నడవనున్నాయి. తిరుపతి నుంచి భవిష్యత్తులో అంతర్జాతీయ గమ్యస్థానాలకు కూడా నేరుగా విమాన కనెక్టివిటీ కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
Key Highlights
  • • తిరుపతి నుంచి విజయవాడ, హైదరాబాద్‌, రాజమండ్రికి కొత్త విమాన సర్వీసులు ప్రారంభం.
  • • ఫ్లై91 విమాన సంస్థ సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రారంభించారు.
  • • తిరుపతి–హైదరాబాద్‌ విమానం రోజువారీగా నడుస్తుంది.
  • • తిరుపతి–విజయవాడ సర్వీసు మంగళ, గురు, శని, ఆదివారాల్లో ఉంటుంది.
  • • తిరుపతి–రాజమండ్రి సర్వీసు సోమ, బుధ, శుక్రవారాల్లో నడుస్తుంది.
  • • తొలి విమానాలకు తిరుపతి, గన్నవరం విమానాశ్రయాల్లో వాటర్‌ కేనన్‌ స్వాగతం.
  • • విజయవాడ–తిరుపతి నేరుగా విమాన కనెక్టివిటీ అమరావతి ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉండనుంది.
  • • తిరుపతి నుంచి కువైత్‌ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు నేరుగా విమాన సర్వీసుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తిరుపతి/రేణిగుంట/గన్నవరం, సెప్టెంబరు 10: తిరుపతి నుంచి విజయవాడ, హైదరాబాద్‌, రాజమండ్రికి కొత్త విమాన సర్వీసులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ‘ఫ్లై91’ విమాన సంస్థకు చెందిన ఈ సర్వీసులను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. తిరుపతి నుంచి విజయవాడకు బయల్దేరిన తొలి విమానానికి ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఫైర్‌ విభాగం సంప్రదాయ వాటర్‌ కేనన్‌ సెల్యూట్‌తో స్వాగతం పలికింది. అనంతరం విమానాశ్రయ అధికారులు తొలి ప్రయాణికుడికి బోర్డింగ్‌ పాస్‌ అందజేసి, ప్రయాణికులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. కొత్త సర్వీసుల షెడ్యూల్‌ను మంత్రి రామ్మోహన్‌ నాయుడు వెల్లడించారు. తిరుపతి–హైదరాబాద్‌ విమానం ప్రతిరోజూ, తిరుపతి–విజయవాడ సర్వీసు మంగళ, గురు, శని, ఆదివారాల్లో, తిరుపతి–రాజమండ్రి సర్వీసు సోమ, బుధ, శుక్రవారాల్లో నడుస్తుందని తెలిపారు. తిరుపతి నుంచి దేశీయ గమ్యస్థానాలకు కనెక్టివిటీని పెంచడంతో పాటు, భవిష్యత్తులో కువైత్‌ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. గన్నవరంలో తొలి విమానానికి స్వాగతం విజయవాడ నుంచి తిరుపతికి నేరుగా విమాన సర్వీసు ప్రారంభం కావడం రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఫ్లై91 సర్వీసు ప్రారంభం సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో కేక్‌ కట్‌ చేసి తొలి ప్రయాణికుడికి బోర్డింగ్‌ పాస్‌ అందజేశారు. తిరుపతి నుంచి వచ్చిన విమానానికి వాటర్‌ కేనన్‌ స్వాగతం పలికారు. విమానాశ్రయ డైరెక్టర్‌ లక్ష్మీకాంత్‌ రెడ్డి, ఫ్లై91 ప్రతినిధులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Powered by Vividuss logo